Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తొర్రూరు డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీఐజీ ఎన్. శ్వేత

Author
Posted By Muthineni babu
| 25 Nov 2026, 07:19 PM |
తొర్రూరు డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీఐజీ ఎన్. శ్వేత

తొర్రూరు, నవంబర్ 25 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత, ఐపీఎస్ బుధవారం తొర్రూరులోని డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ రికార్డులు, విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులతో సమావేశమైన ఆమె పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తులో నాణ్యత, పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్షించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

అంతకుముందు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్, తొర్రూరు డీఎస్పీ కె. కృష్ణ కిషోర్‌లు డీఐజీకి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు సీఐ టి. గణేష్, మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్, తొర్రూరు ఎస్ఐ టి. మహేందర్ రెడ్డితో పాటు దంతాలపల్లి, నర్సింహులపేట, చిన్నగూడూరు, పెద్దవంగర, సీరోల్, మరిపెడ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు పాల్గొన్నారు.