Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మాజీ ఎంపీటీసీ రావుల రజితకు ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాళులు

Author
Posted By Praja Nestham Jwala News
| 25 Nov 2026, 07:20 PM |
మాజీ ఎంపీటీసీ రావుల రజితకు ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాళులు

ధర్మసాగర్, నవంబర్ 25 (ప్రజానేస్తం జ్వాల): ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ రావుల రజిత ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావుల రజిత చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంపీటీసీగా ప్రజాసేవలో రావుల రజిత అందించిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రావుల రజిత కుటుంబ సభ్యులు, స్థానిక సర్పంచ్ జ్యోతి, మండల పార్టీ అధ్యక్షుడు పెసరు రమేష్, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.