Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఉదయ్–అశ్విని వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ కృష్ణ బంటు దంపతులు

Author
Posted By Praja Nestham Jwala News
| 25 Nov 2026, 07:49 PM |
ఉదయ్–అశ్విని వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ కృష్ణ బంటు దంపతులు

నేరేడుచర్ల, నవంబర్ 25 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన సిరికొండ కోటమ్మ–వెంకటయ్యల చిన్న కుమారుడు ఉదయ్, ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన తుర్లకొండ మహాలక్ష్మి–సురేష్‌ల ఏకైక కుమార్తె అశ్వినితో బుధవారం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నేరేడుచర్ల జాన్‌పహాడ్ రోడ్డులోని ఏ వన్ ఫంక్షన్ హాల్‌లో ఈ వివాహ వేడుక వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సీనియర్ జర్నలిస్ట్, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు అనసూయ దంపతులు హాజరయ్యారు. వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, రాజకీయ నాయకులు తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా సంఘం నాయకురాలు గంగా రాధమ్మ, చిల్లేపల్లి సింగిల్ విండో వైస్ చైర్మన్ గంగ రంగారెడ్డి–సువర్ణ దంపతులు, సర్పంచ్ గంట పెద్ద మల్లారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు గంట కృష్ణసాగర్ రెడ్డి, సీపీఎం నాయకుడు సిరికొండ శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పగిడి నవీన్, గంట రంగారెడ్డి, గంట చిన్న మల్లారెడ్డి, పెరుమాళ్ల రంగారెడ్డి, వెంకటరెడ్డి, బొమ్మకంటి లక్ష్మయ్య, గాంధీ, శ్రీనివాస్, బొమ్మకంటి వెంకన్న, పగిడిపల్లి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.