Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బాలికల భద్రత, విద్యపై అవగాహన కల్పించాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 25 Nov 2026, 08:26 PM |
బాలికల భద్రత, విద్యపై అవగాహన కల్పించాలి

బాల్య వివాహాలు, లింగ నిర్ధారణ పరీక్షలకు దూరంగా ఉండాలి

సూర్యాపేట, నవంబర్ 25 (ప్రజానేస్తం జ్వాల): బాలికల భద్రత, విద్య, హక్కుల పరిరక్షణపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశాల మేరకు బేటీ బచావో - బేటీ పడావో పథకంలో భాగంగా "బాలికా ప్రగతి పథం - చైతన్య యాత్ర" కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువశక్తి కళాబృందం సభ్యులు నాటకాల ద్వారా బాలికల భద్రత, బాల్య వివాహాల నివారణ, లింగ నిర్ధారణ పరీక్షల నిషేధం, పి.సి.పి.ఎన్.డి.టి. చట్టంపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో యువశక్తి కళాబృందం ప్రదర్శించిన "ఆడపిల్ల - ప్రేమ పేరుతో లేచిపోయి మోసపోయిన" నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేమ పేరుతో మోసపోయి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రుల సూచనలు పాటిస్తూ చదువుపై దృష్టి సారించాలని నాటిక ద్వారా విద్యార్థినులకు వివరించారు. ఆడపిల్లలను రక్షించాలని, ప్రతి బాలికకు నాణ్యమైన విద్య అందించాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బాలికలు ఆపదలో ఉన్నప్పుడు సహాయం పొందేందుకు అందుబాటులో ఉన్న 1098 బాలల సహాయవాణి, 181 మహిళా సహాయవాణి, 100 పోలీస్ సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి