Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అర్హులకు అందని సంక్షేమ ఫలాలు.. పింఛన్‌ కోసం దివ్యాంగుడి పోరాటం!

Author
Posted By Nagilla Rajinikanth
| 26 Nov 2026, 08:32 AM |
అర్హులకు అందని సంక్షేమ ఫలాలు.. పింఛన్‌ కోసం దివ్యాంగుడి పోరాటం!

  • అధికారుల చుట్టూ ప్రదక్షిణలు!
  • న్యాయం చేయాలని శశాంక్ వేడుకోలు.

కళ్ల చూపు లేక ఇబ్బందులు పడుతున్న ఓ దివ్యాంగుడికి ప్రభుత్వ పింఛన్ అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన మేకల శశాంక్‌కు చూపు సమస్య ఉండటంతో పాటు, అంగవైకల్యానికి సంబంధించి సదరం ధ్రువీకరణ పత్రం కూడా ఉంది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నూతన పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, తన తండ్రికి ట్రాక్టర్ ఉందనే కారణంతో దరఖాస్తు తిరస్కరించినట్లు అధికారులు చెబుతున్నారని శశాంక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తనకు ఉన్న వైకల్యాన్ని పరిగణనలోకి తీసుకుని పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. మరోవైపు, ఎలాంటి వైకల్యం లేనివారు సైతం పింఛన్లు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, తనలాంటి నిజమైన అర్హులకు మాత్రం అన్యాయం జరగడం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు.
గతంలో వికలాంగుల పింఛన్ల కోసం నకిలీ సదరం ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, వాటి ఆధారంగా అనర్హులు పింఛన్లతో పాటు ఆర్టీసీ బస్‌పాస్‌లు, ఉపాధి హామీ పథకంలో రాయితీలు తదితర ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి అనర్హులను గుర్తించాలని, నిజమైన దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అనర్హులకు అడ్డుకట్ట.. అర్హులకు చేయూత అందినప్పుడే సంక్షేమ పథకాల అసలు లక్ష్యం నెరవేరుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అర్హులకు అందని సంక్షేమ ఫలాలు.. పింఛన్‌ కోసం దివ్యాంగుడి పోరాటం! - Additional Image