Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మహబూబాబాద్ గిరిజన గురుకులంలో విద్యార్థిని ప్రసవ ఘటనపై డీఎస్ఎఫ్ఐ ఆగ్రహం

Author
Posted By Muthineni babu
| 26 Nov 2026, 12:42 PM |
మహబూబాబాద్ గిరిజన గురుకులంలో విద్యార్థిని ప్రసవ ఘటనపై డీఎస్ఎఫ్ఐ ఆగ్రహం

బాధ్యులైన ప్రిన్సిపాల్, ఏఎన్ఎం, హౌస్ మాస్టర్‌లను సస్పెండ్ చేయాలి: డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్

మహబూబాబాద్, నవంబర్‌ 26 (ప్రజానేస్తం జ్వాల): మహబూబాబాద్ గిరిజన డిగ్రీ గురుకుల కళాశాలలో విద్యార్థిని ప్రసవం, నవజాత శిశువు మృతి ఘటనపై డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్న విద్యార్థిని విషయంలో కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

జిల్లాకు రెగ్యులర్ డీఈఓ లేకపోవడం, గురుకులాలపై ఆర్సీఓ పర్యవేక్షణ కొరవడటం ఆందోళనకరమన్నారు. నవజాత శిశువు మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులుగా పేర్కొంటున్న కళాశాల ప్రిన్సిపాల్, ఏఎన్ఎం, హౌస్ మాస్టర్‌లను తక్షణమే సస్పెండ్ చేసి, విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ వివేక్ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి