Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎస్‌ఐ పరీక్ష నేపథ్యంలో వాకర్స్‌కు పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి

Author
Posted By Manchala Sairam
| 27 Nov 2026, 11:08 AM |
ఎస్‌ఐ పరీక్ష నేపథ్యంలో వాకర్స్‌కు పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి

ట్రై సిటీ పరిధిలోని ఆరు పరీక్షా కేంద్రాల మైదానాల్లో వాకింగ్‌కు తాత్కాలిక నిషేధం

వరంగల్, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఆధ్వర్యంలో ఈ నెల 29న (ఆదివారం) సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ట్రై సిటీ పరిధిలోని 32 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా పరీక్షా కేంద్రాలుగా ఎంపికైన పాఠశాలలు, కళాశాలల మైదానాల్లో వాకర్స్‌కు తాత్కాలికంగా అనుమతి నిలిపివేశారు. ఈ నెల 28వ తేదీ (శనివారం) సాయంత్రం 6 గంటల నుంచి, 29వ తేదీ (ఆదివారం) ఉదయం కింది పరీక్షా కేంద్రాల మైదానాల్లో వాకింగ్‌కు రావద్దని పోలీసులు సూచించారు.

- సెయింట్ గాబ్రియేల్ హైస్కూల్, కాజీపేట.
- ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, హనుమకొండ.
- కాకతీయ డిగ్రీ కళాశాల, హనుమకొండ.
- కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్.
- లాల్ బహదూర్ కళాశాల, వరంగల్.
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వరంగల్.

ఇవి కూడా చదవండి

పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ చేపడుతున్న భద్రతా చర్యలకు వాకర్స్‌తో పాటు ప్రజలందరూ సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.