Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నర్సంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Author
Posted By Muthineni babu
| 27 Nov 2026, 06:51 PM |
నర్సంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నర్సంపేట, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ అన్నారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని 3వ వార్డు కమలాపురంలో శ్రీ వెంకటేశ్వర రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర పొందాలని అన్నారు.