Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజల విశ్వాసమే విజయానికి చిరునామా.. యూనియన్ బ్యాంక్‌కు 13 ఏళ్లు!

Author
Posted By Nagilla Rajinikanth
| 27 Nov 2026, 06:55 PM |
ప్రజల విశ్వాసమే విజయానికి చిరునామా.. యూనియన్ బ్యాంక్‌కు 13 ఏళ్లు!

కొత్తకొండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ 13వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్లు పరమేశ్వర్, రవీందర్‌తో పాటు బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు కలిసి కేక్ కట్ చేసి వార్షికోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేనేజర్లు మాట్లాడుతూ.. గత 13 ఏళ్లుగా బ్యాంకుపై విశ్వాసం ఉంచి తమ సేవలను వినియోగించుకుంటున్న ప్రజలు, రైతులు, ఖాతాదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణ, ఖాతాదారుల నమ్మకమే బ్యాంకు ప్రగతికి ప్రధాన బలమని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడంతో పాటు రైతులు, చిరు వ్యాపారులు, సామాన్య ఖాతాదారులకు అవసరమైన ఆర్థిక సేవలను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములవుతామని వెల్లడించారు. 13 ఏళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.