Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అర్హులకు అండగా ప్రభుత్వ సంక్షేమ చర్యలు

Author
Posted By Nagilla Rajinikanth
| 27 Nov 2026, 06:58 PM |
అర్హులకు అండగా ప్రభుత్వ సంక్షేమ చర్యలు

ఉచిత సహాయక ఉపకరణాల పంపిణీకి నిర్ధారణ శిబిరం
అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

ముల్కనూర్, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): అర్హులైన మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వయోవృద్ధులకు అవసరమైన సహాయక ఉపకరణాలను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలనే లక్ష్యంతో నిర్ధారణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు శుక్రవారం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని సాయి గార్డెన్స్‌లో అలింకో సంస్థ సహకారంతో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిర్ధారణ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం శిబిరంలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, అర్హత నిర్ధారణ ప్రక్రియలను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అర్హులకు అండగా ప్రభుత్వ సంక్షేమ చర్యలు - Additional Image

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాల నుంచి శిబిరానికి వచ్చిన మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వయోవృద్ధులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సహాయక ఉపకరణాలు పొందేందుకు అర్హులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్ధారణ పరీక్షల్లో అర్హులుగా గుర్తించిన వారికి త్వరలోనే అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఎవరూ ఈ అవకాశాన్ని కోల్పోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. శిబిరానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి పరీక్షల ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

అర్హుల గుర్తింపు ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా సమన్వయంతో పనిచేయాలని, శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, మండల ప్రత్యేక అధికారి కమలాకర్ రెడ్డి, తహసీల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, సీడీపీవోలు స్వరూప, సింధురాణి, ఎఫ్‌ఆర్‌వో రవికృష్ణ, ఇతర అధికారులు, అలింకో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.