Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గుట్ట కింది తండా వాసుల రోడ్డు కష్టాలు తీరనున్నాయి

Author
Posted By Nagilla Rajinikanth
| 27 Nov 2026, 07:18 PM |
గుట్ట కింది తండా వాసుల రోడ్డు కష్టాలు తీరనున్నాయి

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన సర్పంచ్ డప్పు శ్రీనివాస్

భీమదేవరపల్లి, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): ఏళ్ల తరబడి సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గుట్ట కింది తండా వాసుల రోడ్డు కష్టాలు త్వరలో తీరనున్నాయి. రాంనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని రోడ్డు మీద తండా నుంచి గుట్ట కింది తండా వరకు చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ డప్పు శ్రీనివాస్, ఉపసర్పంచ్ భూక్య తిరుపతితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా సరైన రహదారి లేక తండా ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా నిత్యావసర పనులు, ఇతర అవసరాల కోసం ప్రయాణించే సమయంలో రహదారి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో సుమారు రూ.కోటి నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

రోడ్డు నిర్మాణానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తండా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. పనులు పూర్తయితే గుట్ట కింది తండా ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడనుంది. ఈ కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ మహిళా అధ్యక్షురాలు బాదావత్ కళావతి, లక్ష్మణ్, వీరన్న, సంపత్, మంజుల తదితరులు పాల్గొన్నారు.