Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలే బలమైన వేదికలు

Author
Posted By Nagaraju Golla
| 27 Nov 2026, 07:24 PM |
రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలే బలమైన వేదికలు

పెద్దాపురం పీఏసీఎస్‌ను రైతులకు మరింత సేవలందించే ఆదర్శ సంస్థగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

దామెర, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు బలమైన వేదికలని, వాటిని మరింత బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, వారి సమస్యలకు పరిష్కారం చూపేలా పెద్దాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. దామెర మండలం ఊరుగొండ సొసైటీ కార్యాలయంలో పెద్దాపురం పీఏసీఎస్ చైర్మన్ కమలాపురం రమేష్, నూతన పాలకమండలి సభ్యుల పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఊరుగొండ స్టేజీ నుంచి సొసైటీ కార్యాలయం వరకు డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నూతన చైర్మన్, పాలకమండలి సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలే బలమైన వేదికలు - Additional Image

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. కష్టపడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, అందరూ ఒక కుటుంబంలా కలిసి పనిచేసి పీఏసీఎస్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. రైతులు సంఘటితంగా అభివృద్ధి చెందేందుకు సహకార వ్యవస్థను ఏర్పాటు చేశారని, ఆ లక్ష్యాన్ని నూతన పాలకమండలి ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

రైతులకు మెరుగైన సేవలు అందించడం, వారి సమస్యలను గుర్తించి పరిష్కరించడం నూతన కార్యవర్గం ప్రధాన బాధ్యతగా భావించాలని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ సేవలను సకాలంలో అందించడంలో పీఏసీఎస్ కీలక పాత్ర పోషించాలని తెలిపారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. క్లస్టర్ల వారీగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కన్సల్టెన్సీ ద్వారా రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

పెద్దాపురంలో గోదాం నిర్మాణం చేపడతామని, పీఏసీఎస్ కార్యాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా సమష్టిగా పనిచేయాలని, మారుతున్న వ్యవసాయ పద్ధతులకు అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీసీఓ మోహన్, ఊరుగొండ సర్పంచ్ పోలేపాక శ్రీనివాస్, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, పెంచికలపేట పీఏసీఎస్ చైర్మన్ అగితే లింగన్న, ఆత్మకూరు పీఏసీఎస్ చైర్మన్ నాగెల్లి స్వప్న ఆంధ్రయ్య, తహశీల్దార్‌ జ్యోతి, ఏవో రాకేష్, ఎస్సై వీరభద్రం, పీఏసీఎస్ సీఈఓ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుబాసి రాజేందర్, రేవూరి జలంధర్ రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి శ్రీధర్ రెడ్డి, సర్పంచులు, నాయకులు, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.