Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

Author
Posted By Nagaraju Golla
| 27 Nov 2026, 07:26 PM |
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

సహకార సంఘాలు రైతులకు బలమైన అండగా నిలవాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

సంగెం, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సహకార సంఘాలు రైతులకు బలమైన అండగా నిలుస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సంగెం మండలం కాపుల కనపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయంలో నూతన పాలకమండలి పదవీ బాధ్యతల స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నూతన చైర్మన్ చొల్లేటి మాధవరెడ్డితో పాటు పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం - Additional Image

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాపుల కనపర్తి పీఏసీఎస్‌ను ఆదర్శవంతమైన నమూనా సహకార సంఘంగా తీర్చిదిద్దాలనే నమ్మకం నూతన చైర్మన్ మాధవరెడ్డి, డైరెక్టర్లపై తనకు ఉందన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చడంతో పాటు వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు పాలకమండలి కృషి చేయాలని సూచించారు. మారుతున్న వ్యవసాయ పద్ధతులు, రైతుల అవసరాలకు అనుగుణంగా సహకార సంఘాలు ఆధునిక విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. పీఏసీఎస్ అనేది కేవలం వ్యాపార కార్యకలాపాలకే పరిమితమైన సంస్థ కాదని, రైతుల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం, వారికి అవసరమైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేసే సహకార వ్యవస్థ అని వివరించారు.

ఇవి కూడా చదవండి

కాపుల కనపర్తి పీఏసీఎస్ డీసీసీబీలో విలీనమైందని పేర్కొన్న ఎమ్మెల్యే, రైతులకు ఎరువులు, వ్యవసాయ అవసరాలు, ఆర్థిక సహకారం వంటి సేవలను సమర్థవంతంగా అందించాలని ఆకాంక్షించారు. రైతుల అవసరాలను గుర్తించి వారికి సకాలంలో సేవలు అందించడం ద్వారా సహకార సంఘాలపై నమ్మకాన్ని మరింత పెంపొందించాలని అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్, డైరెక్టర్లు రైతుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సంఘాన్ని ఆదర్శవంతమైన నమూనా సహకార సంస్థగా అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు.