Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు.. ఇద్దరు ఉద్యోగులు అరెస్ట్

Author
Posted By Praja Nestham Jwala News
| 27 Nov 2026, 07:38 PM |
సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు.. ఇద్దరు ఉద్యోగులు అరెస్ట్

సంగారెడ్డి, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): సదాశివపేట మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి ఇద్దరు ఉద్యోగులను పట్టుకున్నారు. ఏసీబీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్‌ ఏ. రాజేష్ కుమార్, ఔట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌ ఏ. శివారెడ్డి రూ.15 వేల లంచం వ్యవహారంలో పట్టుబడ్డారు.

ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. 2025 గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఉబా చెరువులో పూడికతీత పనులు చేపట్టగా, ఆ పనులకు సంబంధించిన రూ.4.50 లక్షల కాంట్రాక్టు బిల్లును మంజూరు చేసి, చెల్లింపు ప్రక్రియ పూర్తి చేసినందుకు ప్రతిఫలంగా ఫిర్యాదుదారుడి నుంచి అసిస్టెంట్ ఇంజినీర్‌ రాజేష్ కుమార్ రూ.15 వేల లంచం డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో మున్సిపల్ కార్యాలయంలో ఆ మొత్తాన్ని స్వీకరించినట్లు ఏసీబీ పేర్కొంది.

లంచంగా తీసుకున్న నగదును భద్రపరచాలని రాజేష్ కుమార్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌ శివారెడ్డికి ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం శివారెడ్డి వద్ద నుంచి ఆ నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

రాజేష్ కుమార్, శివారెడ్డి తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేసి అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ ఆరోపించింది. ఈ కేసులో ఇద్దరినీ అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ తన ప్రకటనలో పేర్కొంది.