Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 27 Nov 2026, 07:40 PM |
వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలి

పాఠశాలలు, ఆసుపత్రుల పరిసరాల్లో సంచారాన్ని అరికట్టాలి: అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్

ఆసిఫాబాద్, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): ఆసిఫాబాద్ జిల్లాలో వీధి కుక్కల సంచారాన్ని నియంత్రించి ప్రజలకు భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వీధి కుక్కల నియంత్రణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

జిల్లాలో వీధి కుక్కల సంఖ్యను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి నియంత్రణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కోసిని శివారులో కుక్కల కోసం ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రుల పరిసరాల్లో వీధి కుక్కల సంచారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఏర్పాటు చేసే ఆశ్రయ కేంద్రాల్లో కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. వీధి కుక్కల సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.