Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో భోజనం, వసతి సమస్యలపై విద్యార్థుల ఆందోళన

Author
Posted By Marelli kiran
| 27 Nov 2026, 08:19 PM |
కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో భోజనం, వసతి సమస్యలపై విద్యార్థుల ఆందోళన

అన్నంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు.. బాలికల వసతి గృహాల్లోనూ తీవ్ర ఇబ్బందులు

హనుమకొండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): కాకతీయ విశ్వవిద్యాలయం హాస్టళ్లలో నెలకొన్న భోజనం, వసతి, పారిశుద్ధ్య సమస్యలపై విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో అడిషనల్ కలెక్టర్ ఎన్. రవి, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, ఏసీపీ నరసింహారావు, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం విద్యార్థి సంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో బాయ్స్ హాస్టల్‌లో అందించే భోజనంలో తరచూ పురుగులు కనిపిస్తున్నాయని, హాస్టల్ ప్రాంగణంలో కనీస పారిశుద్ధ్య నిర్వహణ కూడా సక్రమంగా లేదని విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నాణ్యమైన భోజనం అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని కోరారు. గర్ల్స్ హాస్టల్‌లో తీవ్ర వసతి కొరత ఉందని విద్యార్థినులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్న శిథిల భవనాల్లో నివసించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన వసతి కల్పించడంతో పాటు శిథిల భవనాల సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

విద్యార్థులు తెలిపిన సమస్యలను ఉన్నతాధికారులు సావధానంగా విన్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే చేపట్టిన చర్యల పురోగతిని సమీక్షిస్తామని తెలిపారు.