Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హనుమకొండ జిల్లాలో 1.20 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ

Author
Posted By Marelli kiran
| 27 Nov 2026, 08:22 PM |
హనుమకొండ జిల్లాలో 1.20 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ

హనుమకొండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద హనుమకొండ జిల్లాలోని 12 మండలాల పరిధిలో 1.20 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్‌డీఓ) మేన శ్రీను తెలిపారు. 18 ఏళ్లు నిండిన స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు నాణ్యమైన చిలకపచ్చ రంగు చీరలను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో మొత్తం 1.20 లక్షల మంది మహిళలను లబ్ధిదారులుగా గుర్తించగా, పంపిణీ కోసం ముందస్తుగా 1.50 లక్షల చీరలు జిల్లాకు చేరుకున్నాయని వివరించారు.

సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశాల మేరకు పంపిణీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు మేన శ్రీను పేర్కొన్నారు. త్వరలోనే జిల్లాలోని అన్ని మండలాల్లో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.