Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రోడ్డు ప్రమాదంలో ఐనవోలు యువకుడు మృతి.. సోదరుడికి తీవ్ర గాయాలు

Author
Posted By Marelli kiran
| 27 Nov 2026, 08:26 PM |
రోడ్డు ప్రమాదంలో ఐనవోలు యువకుడు మృతి.. సోదరుడికి తీవ్ర గాయాలు

ప్రమాద స్థలంలో వీధి దీపాలు లేకపోవడంపై బంధువుల ఆందోళన

హనుమకొండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): ఉపాధి కోసం రంగులద్దే పనికి వెళ్లిన ఓ యువకుడు ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలులో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల ప్రకారం.. ఐనవోలుకు చెందిన శ్రీకాంత్ (26) తన సోదరుడు ప్రణయ్‌తో కలిసి పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో పున్నేల్ క్రాస్ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం వారి వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో శ్రీకాంత్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అతని సోదరుడు ప్రణయ్ తీవ్ర గాయాలపాలవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వీధి దీపాలు లేకపోవడంపై మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. రహదారిపై తగిన వెలుతురు ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి