Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కమలాపూర్‌లో 8 దళిత కుటుంబాలకు విముక్తి.. 14 ఏళ్లుగా కొనసాగుతున్న పనుల వ్యవహారంపై అధికారుల విచారణ

Author
Posted By Marelli kiran
| 27 Nov 2026, 08:28 PM |
కమలాపూర్‌లో 8 దళిత కుటుంబాలకు విముక్తి.. 14 ఏళ్లుగా కొనసాగుతున్న పనుల వ్యవహారంపై అధికారుల విచారణ

అప్పు పేరుతో నిర్బంధంగా పనులు చేయిస్తున్నారనే ఫిర్యాదు.. ఫ్యాక్టరీలో అధికారుల తనిఖీలు

హనుమకొండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని ఓ సిమెంట్ ఇటుకల తయారీ కర్మాగారంలో ఎనిమిది దళిత కుటుంబాలు దీర్ఘకాలంగా నిర్బంధ పరిస్థితుల్లో పనిచేస్తున్నాయనే ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ కుటుంబాలు అప్పు పేరుతో సుమారు 14 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. కుటుంబానికి వారానికి కేవలం రూ.600 మాత్రమే చెల్లిస్తూ పనులు చేయిస్తున్నారని, కుటుంబాల్లోని చిన్నారులతోనూ పనులు చేయిస్తున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు సదరు కర్మాగారంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ పనిచేస్తున్న ఎనిమిది కుటుంబాల పరిస్థితిని పరిశీలించి, వారిని పని నుంచి విముక్తి కల్పించినట్లు సమాచారం. అనంతరం బాధిత కుటుంబాలను పునరావాస చర్యల నిమిత్తం కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి అప్పు పేరుతో నిర్బంధంగా పనులు చేయించారనే ఫిర్యాదులోని అంశాలపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. బాధిత కుటుంబాలకు అవసరమైన పునరావాస సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి