Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వాట్సాప్‌ వినియోగదారులకు సీఈఆర్టీ హెచ్చరిక.. వెంటనే యాప్‌ను అప్‌డేట్ చేసుకోండి

Author
Posted By Marelli kiran
| 27 Nov 2026, 08:31 PM |
వాట్సాప్‌ వినియోగదారులకు సీఈఆర్టీ హెచ్చరిక.. వెంటనే యాప్‌ను అప్‌డేట్ చేసుకోండి

భద్రతా లోపాలతో వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం.. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని సూచన

హనుమకొండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): ప్రముఖ సందేశాల యాప్ వాట్సాప్‌ వినియోగదారులకు భారత కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం (సీఈఆర్టీ-ఇన్‌) కీలక హెచ్చరిక జారీ చేసింది. వాట్సాప్‌లో గుర్తించిన భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రత్యేక సందేశాలు, జతచేసిన ఫైళ్లు లేదా అనుమానాస్పద లింకుల ద్వారా వినియోగదారుల ఫోన్లలో హానికరమైన కోడ్‌ను అమలు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనివల్ల వ్యక్తిగత, సున్నితమైన సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.

ఈ భద్రతా ముప్పు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, విండోస్‌, మ్యాక్‌ పరికరాలను ఉపయోగించే వారికీ ఉండవచ్చని పేర్కొంది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులు వాట్సాప్‌ను 2.26.35.74 లేదా అంతకంటే పై సంస్కరణకు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. అలాగే తెలియని నంబర్ల నుంచి వచ్చే అనుమానాస్పద సందేశాలు, లింకులు, ఫైళ్లను తెరవకుండా జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు తాజా సంస్కరణకు అప్‌డేట్ చేసుకోవడం, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండటం ద్వారా సైబర్ ముప్పుల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.