Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తపాలా శాఖ ఆధునికీకరణకు కేంద్రం రూ.2,632 కోట్ల కేటాయింపు

Author
Posted By Marelli kiran
| 27 Nov 2026, 08:35 PM |
తపాలా శాఖ ఆధునికీకరణకు కేంద్రం రూ.2,632 కోట్ల కేటాయింపు

హనుమకొండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): భారతీయ తపాలా వ్యవస్థను ఆధునికీకరించి ప్రజలకు మరింత వేగవంతమైన, మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,632 కోట్ల నిధులను కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఐదేళ్లపాటు ఈ నిధులను దశలవారీగా వినియోగించనున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.

తపాలా శాఖను సంప్రదాయ సేవలకే పరిమితం చేయకుండా ఆదాయాన్ని పెంచే సంస్థగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా కొత్త పోస్టాఫీసుల నిర్మాణం, ఇప్పటికే ఉన్న కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, పార్శిల్ సేవల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.

తపాలా శాఖ ఆదాయంలో వృద్ధి నమోదవుతోందని, ముఖ్యంగా పార్శిల్ విభాగం 71 శాతం వృద్ధిని సాధించిందని మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా పోస్టాఫీసులను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసి, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడమే ఈ నిధుల కేటాయింపు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న ఈ ఆధునికీకరణ చర్యలతో తపాలా సేవల సామర్థ్యం పెరగడంతో పాటు పార్శిల్ రవాణా రంగంలోనూ మరింత విస్తరణకు అవకాశం ఏర్పడనుంది.

ఇవి కూడా చదవండి