Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జ్యోతిబా ఫూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Author
Posted By Nagaraju Golla
| 28 Nov 2026, 01:33 PM |
జ్యోతిబా ఫూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఆత్మకూర్‌, నవంబర్‌ 28 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌ మండలం నీరుకుల్ల గ్రామంలో మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్య, సామాజిక సమానత్వం, మహిళా సాధికారత కోసం ఆయన చేసిన పోరాటాన్ని, అణగారిన వర్గాల అభ్యున్నతికి అందించిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా సోషల్ సైంటిస్ట్ మేడ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. జ్యోతిబా ఫూలే సమాజంలో నెలకొన్న కులవివక్ష, అసమానతలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని నమ్మి, మహిళలు, అణగారిన వర్గాలకు విద్యా అవకాశాలు కల్పించేందుకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి తరానికి పరిచయం చేయడంతో పాటు, సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జ్యోతిబా ఫూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - Additional Image

కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మడికొండ రత్నాకర్, సర్పంచ్ తడక నీరజ శ్రీనివాస్, వార్డు సభ్యులు, నీలం రాజు, ఉడుత రాజేందర్, పసుల లక్ష్మినారాయణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి