Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సమాజ మార్పుకు చదువే ఆయుధమని చాటిన మహనీయుడు జ్యోతిరావు పూలే

Author
Posted By Muthineni babu
| 28 Nov 2026, 03:15 PM |
సమాజ మార్పుకు చదువే ఆయుధమని చాటిన మహనీయుడు జ్యోతిరావు పూలే

హరిపిరాల, నవంబర్ 28 (ప్రజానేస్తం జ్వాల): మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలోని స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త తలారి అశోక్ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశానికి విద్యా మార్గాన్ని చూపిన దిక్సూచి అని కొనియాడారు. సతీసహగమనం వంటి సామాజిక దురాచారాల నిర్మూలనకు, మహిళా విద్యాభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా నేడు అంతరిక్షంలో రాకెట్లు నడిపే స్థాయికి ఎదగడానికి పూలే వంటి సంఘసంస్కర్తలు వేసిన పునాదులే కారణమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ చెంచర్ల స్వాతి రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.వి. రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.