Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఢిల్లీ కోటాలో సేవారత్నం అవార్డు అందుకున్న పిల్లుట్ల రఘును గరిడేపల్లి మండల కేంద్రంలో ఘనంగా సన్మానిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు.

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Oct 2026, 07:40 PM | Politics
ఢిల్లీ కోటాలో సేవారత్నం అవార్డు అందుకున్న పిల్లుట్ల రఘును గరిడేపల్లి మండల కేంద్రంలో ఘనంగా సన్మానిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు.

📌 ఆరేళ్లుగా సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు

గరిడేపల్లి, అక్టోబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల):హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలో గత ఆరు సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్న ఓజో ఫౌండేషన్‌ అధినేత, బీఆర్‌ఎస్‌ పార్టీ యువ నాయకుడు పిల్లుట్ల రఘుకు ఢిల్లీ కోటాలో డాక్టర్‌ సేవారత్నం అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆదివారం గరిడేపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించారు.పిల్లుట్ల రఘు సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతూ.. తనపై అభిమానంతో సన్మానం చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ప్రజా సేవకు మరింత ప్రాధాన్యతనిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడతానని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తనవంతు సహాయాన్ని అందిస్తానని తెలిపారు.బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో కూడా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలకు ప్రజలు, పార్టీ నాయకులు అందిస్తున్న సహకారం మరువలేనిదని రఘు అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్‌, సీనియర్‌ నాయకులు వీరం రెడ్డి, శంబిరెడ్డి, గుత్తికొండ వెంకటరమణారెడ్డి, మన్నెం వేణు యాదవ్‌, సర్పంచులు మాలోతు సుధాకర్‌, వాంకుడోత్‌ రవి నాయక్‌, మచ్చ ముత్తమ్మ, మురళి, మాజీ సర్పంచులు నల్లపాటి వీరమ్మ, భాస్కర్‌, కోట వీరస్వామి, గ్రామ శాఖ అధ్యక్షులు ముంగి అచ్చయ్య, నరేందర్‌ నాయక్‌, మండల ఎస్టీ సెల్‌ అధ్యక్షులు సందీప్‌ నాయక్‌, యూత్‌ అధ్యక్షులు మండవ నాగేశ్వరరావు, దొంతగాని రాంబాబు, భోగాల నిరంజన్‌రెడ్డి, దాసరి వీరస్వామి, బచ్చలకూరి కోటయ్య, రవీందర్‌ నాయక్‌, నరసింహ తదితర బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.