Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ జిల్లా కార్యవర్గం ప్రకటన

Author
Posted By Praja Nestham Jwala News
| 10 Oct 2026, 09:10 PM |
కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ జిల్లా కార్యవర్గం ప్రకటన

ఆసిఫాబాద్‌, అక్టోబర్‌ 10 (ప్రజానేస్తం జ్వాల) : కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి మైనార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిలుపునిచ్చారు. మైనార్టీల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ ప్రజా సంక్షేమ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో శనివారం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ మైనార్టీ సెల్‌ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జిల్లా మైనార్టీ సెల్‌ చైర్మన్‌ అర్షద్‌ హుస్సేన్‌తో కలిసి కార్యవర్గ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ పార్టీలో మైనార్టీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ, పార్టీ అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మైనార్టీ వర్గాల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అబ్దుల్లా బిన్‌ అహ్మద్‌, డీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఉబేద్‌ బిన్‌ యహియా (తారిక్‌), టౌన్‌ ప్రెసిడెంట్‌ మీర్‌ కాశీఫ్‌ అలీ హష్మీ, ఎస్సీ సెల్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్‌ జాడీ ప్రసాద్‌, జిల్లా మైనార్టీ సెల్‌ జనరల్‌ సెక్రటరీ షేక్‌ కలీం, యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు కృష్ణ, ఎండీ తాజ్‌, జాడీ తిరుపతి, సిర్పూర్‌ (టి) మైనార్టీ మండల అధ్యక్షుడు ముకీద్‌, కౌటాల మైనార్టీ మండల అధ్యక్షుడు తుఫైల్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.