Deprecated: strpos(): Passing null to parameter #1 ($haystack) of type string is deprecated in /home/u227957947/websites/pB4caznae/public_html/single.php on line 64
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 35 మంది ఎస్‌ఐల బదిలీ
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 35 మంది ఎస్‌ఐల బదిలీ

Author
Posted By Praja Nestham Jwala News
| 10 Oct 2026, 09:13 PM |

వరంగల్, అక్టోబర్ 10: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పరిపాలనా కారణాలతో 35 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లను (ఎస్‌ఐలు) బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులకు కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు. బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి సీ.నెం. 12/A1-Estt/2026, సీ.ఓ. నెం. 9387/2026 ఉత్తర్వుల మేరకు ఈ బదిలీలు చేపట్టారు. హనుమకొండ, పరకాల, దేవరుప్పుల, పాలకుర్తి, ధర్మసాగర్, వంగర సహా పలు పోలీస్‌స్టేషన్లలో ఎస్‌ఐల స్థానాలు మారాయి.

ముఖ్యమైన బదిలీలు ఇవే..
బండి శ్రవణ్ కుమార్: లింగాల ఘణపురం నుంచి చిల్పూర్‌కు.
సిరిపురం నవీన్ కుమార్: చిల్పూర్ నుంచి హనుమకొండకు.
కల్తి కిశోర్: హనుమకొండ నుంచి లింగాల ఘణపురానికి.
చింత రాజు: కొడకండ్ల నుంచి దేవరుప్పులకు.
ఊర సృజన్ కుమార్: దేవరుప్పుల నుంచి పాలకుర్తికి.
డి. పవన్ కుమార్: పాలకుర్తి నుంచి ధర్మసాగర్‌కు.
దూదిమెట్ల నరేష్: రఘునాథపల్లి నుంచి వేలేరుకు.
రావుల రణధీర్: దుగ్గొండి నుంచి పరకాలకు.
చాగర్ల రఘుపతి: పరకాల నుంచి నర్మెట్టకు.
గొల్లపల్లి దివ్య: వంగర నుంచి హనుమకొండకు.
బొల్లం వినయ్ కుమార్: ఘన్‌పూర్ (డబ్ల్యూ) నుంచి జఫర్‌గఢ్‌కు.
భతుల రామారావు: జఫర్‌గఢ్ నుంచి మడికొండకు.
పెగడ రాజ్ కుమార్: మడికొండ నుంచి పర్వతగిరికి.
బోగం ప్రవీణ్: పర్వతగిరి నుంచి వర్ధన్నపేటకు.
ఎన్. సాయి బాబు: వర్ధన్నపేట నుంచి మిల్స్ కాలనీకి.

ఇతర బదిలీల్లో భాగంగా పలువురు ఎస్‌ఐలకు నర్సంపేట, జంగాం, సుబేదారి, మట్వాడ, సీసీఎస్‌, సీటీసీ తదితర ప్రాంతాల్లో పోస్టింగ్‌లు కేటాయించారు. మరికొందరు అధికారులను ప్రత్యేక విభాగాలకు అటాచ్ చేశారు. బదిలీ అయిన ఎస్‌ఐలను వెంటనే రిలీవ్ చేసి, కొత్తగా కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్‌స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓలు), సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను పోలీస్ కమిషనర్ ఆదేశించారు. అధికారులు కొత్త పోస్టింగ్‌లలో విధుల్లో చేరిన తేదీ వివరాలను కమిషనరేట్ కార్యాలయానికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి