Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Author
Posted By Marelli kiran
| 14 Oct 2026, 03:15 PM |
బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

హనుమకొండ, ప్రజానేస్తం జ్వాల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలు ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో జరుపుకునేలా నగరవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. పండుగకు వచ్చే మహిళలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో బుధవారం కమిషనర్ చిన్నవడ్డేపల్లి, బేస్తం, ఉర్సు, బంధం చెరువులతో పాటు పద్మాక్షి గుండం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బతుకమ్మ నిమజ్జనానికి వచ్చే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో సమీక్షించారు.

పారిశుధ్యం, భద్రతకు ప్రాధాన్యం

చెరువుల ఘాట్ల వద్ద పారిశుధ్య నిర్వహణను పటిష్టం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగినంత విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు, స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని, భద్రతా చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. పండుగ సమయంలో ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేసి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి