Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రేపు గట్లకానిపర్తి, పోచారం ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

Author
Posted By Praja Nestham Jwala News
| 14 Oct 2026, 04:44 PM |
రేపు గట్లకానిపర్తి, పోచారం ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

శాయంపేట, అక్టోబర్‌ 14 (ప్రజానేస్తం జ్వాల): నేషనల్ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులకు సంబంధించి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో రేపు (అక్టోబర్ 15) గట్లకానిపర్తి సబ్‌స్టేషన్‌ పరిధిలోని రెండు ఫీడర్లలో విద్యుత్‌ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఆపరేషన్‌ శాయంపేట అసిస్టెంట్‌ ఇంజనీర్‌ మాసు చొక్కా రావు తెలిపారు. గట్లకానిపర్తి ఇండస్ట్రియల్‌ ఫీడర్‌, పోచారం ఫీడర్ల పరిధిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విద్యుత్‌ అంతరాయం కారణంగా ఆయా ఫీడర్ల పరిధిలోని వ్యవసాయ, వాణిజ్య, గృహ విద్యుత్‌ వినియోగదారులతో పాటు రైతులు, మిల్లర్లు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మరమ్మతుల పనులకు సహకరించి, విద్యుత్‌ సరఫరా నిలిపివేతను గమనించి తమ కార్యకలాపాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకోవాలని కోరారు.