Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మోదీ జన్మదినం సందర్భంగా మానసిక దివ్యాంగులకు అన్నదానం

Author
Posted By Praja Nestham Jwala News
| 14 Oct 2026, 05:14 PM |
మోదీ జన్మదినం సందర్భంగా మానసిక దివ్యాంగులకు అన్నదానం

  • సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా కోదాడలో సేవా కార్యక్రమం

కోదాడ, ప్రజానేస్తం జ్వాల: భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా సూర్యాపేట జిల్లా బీజేపీ దివ్యాంగుల సెల్‌ కన్వీనర్‌ ఏమిరెడ్డి శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కోదాడలోని శనగల రాధాకృష్ణ ట్రస్ట్‌లో మానసిక దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మోదీ జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మానసిక దివ్యాంగుల కోసం అన్నదానం నిర్వహించిన శంకర్‌రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌, దివ్యాంగుల సెల్‌ జోనల్‌ ఇన్‌చార్జ్‌ గోలి ప్రభాకర్‌, జిల్లా కోశాధికారి తాళ్ల నరేందర్‌రెడ్డి, జనార్దన్‌, పరశురామ్‌, సత్యరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.