Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఉపాధి పనుల పురోగతిపై జెడ్పీ సీఈఓ తనిఖీ

Author
Posted By Praja Nestham Jwala News
| 15 Oct 2026, 10:06 PM |
ఉపాధి పనుల పురోగతిపై జెడ్పీ సీఈఓ తనిఖీ

భీమదేవరపల్లి, అక్టోబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించేలా వేతన ఉపాధి పనులను సమర్థవంతంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా పరిషత్ సీఈఓ శేషాద్రి సంబంధిత అధికారులకు సూచించారు. ఉపాధి పనుల్లో కూలీల సంఖ్యను మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర, ముల్కనూర్, ఎర్రబెల్లి గ్రామ పంచాయతీల పరిధిలో జరుగుతున్న వీబీజీ రాంజీ ఉపాధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని తనిఖీ చేసి, అమలవుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనుల నిర్వహణలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కూలీలకు పనులు కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. గ్రామాల్లో ఉపాధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి, కూలీలకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందేలా చూడాలని తెలిపారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామీణ కూలీలకు పని కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరేశం, మండల ఉపాధి హామీ పథక అధికారులు, ఇతర సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.