Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

న్యాయమూర్తిగా మల్లారం యువకుడు డ్యాగల సాయి పవన్ ఎంపిక

Author
Posted By Praja Nestham Jwala News
| 15 Oct 2026, 10:12 PM |
న్యాయమూర్తిగా మల్లారం యువకుడు డ్యాగల సాయి పవన్ ఎంపిక

భీమదేవరపల్లి, అక్టోబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): పట్టుదల, కృషితో న్యాయరంగంలో వరుస విజయాలు సాధిస్తూ మల్లారం గ్రామ యువకుడు డ్యాగల సాయి పవన్ గుర్తింపు పొందారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన ఆయన జూనియర్ సివిల్ జడ్జి నియామక పరీక్షలో అర్హత సాధించారు. నాలుగు రోజుల క్రితమే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) నియామక పరీక్షలోనూ అర్హత సాధించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయి పవన్ తొలుత హుజూరాబాద్ సమీపంలోని సింగపూర్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసించారు. అనంతరం న్యాయశాస్త్రంపై ఆసక్తితో న్యాయవిద్యను ఎంచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఆ తర్వాత న్యూఢిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టులతో పాటు హనుమకొండ జిల్లా కోర్టులో ఇంటర్న్‌షిప్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముద్దసాని సహోదర రెడ్డి వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. న్యాయవృత్తిలో అనుభవాన్ని సంపాదిస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమై జూనియర్ సివిల్ జడ్జి నియామక పరీక్షలో అర్హత సాధించారు.

నాలుగు రోజుల వ్యవధిలో రెండు విజయాలు
జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలో అర్హత సాధించడానికి కొద్ది రోజుల ముందే తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామక పరీక్షలోనూ సాయి పవన్ అర్హత సాధించారు. తక్కువ వ్యవధిలో రెండు కీలక నియామక పరీక్షల్లో అర్హత సాధించడం ఆయన న్యాయరంగంలో సాగిస్తున్న కృషిని ప్రతిబింబిస్తోంది. మల్లారం గ్రామానికి చెందిన యువకుడు న్యాయమూర్తి నియామక పరీక్షలో అర్హత సాధించడంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయి పవన్ సాధించిన విజయాలు న్యాయరంగంలో స్థిరపడాలని ఆశించే యువతకు ప్రేరణగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో న్యాయరంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.