Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

14 రివార్డుల విజేత.. ఏఆర్‌ ఎస్‌ఐ గోపి కన్నుమూత

Author
Posted By Praja Nestham Jwala News
| 15 Oct 2026, 10:28 PM |
14 రివార్డుల విజేత.. ఏఆర్‌ ఎస్‌ఐ గోపి కన్నుమూత

మహబూబాబాద్, అక్టోబర్‌ 15 (ప్రజానేస్తం జ్వాల) : మహబూబాబాద్ జిల్లా వాసి, రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్‌లో ఏఆర్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న గోపి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు (సి) గుజిలితండాకు చెందిన గోపి 2013లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో అంకితభావం, ప్రతిభతో ముందుకు సాగుతూ హెడ్‌ కానిస్టేబుల్‌గా, అనంతరం ఏఆర్‌ ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. తన సర్వీసులో వీఐపీ బందోబస్తు, ఎన్నికల విధులు వంటి కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. విధి నిర్వహణలో కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా ఆయన 14 రివార్డులను అందుకున్నారు. కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ఏఆర్‌ ఎస్‌ఐ స్థాయికి ఎదిగిన గోపి మృతి ఆయన స్వగ్రామమైన గుజిలితండాలోనూ, పోలీసు వర్గాల్లోనూ విషాదాన్ని నింపింది. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు సానుభూతి తెలియజేస్తున్నారు.