Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సూర్యాపేటలో జాతీయ ఐక్యతా పరుగు

Author
Posted By Praja Nestham Jwala News
| 31 Oct 2026, 06:33 PM |
సూర్యాపేటలో జాతీయ ఐక్యతా పరుగు

సూర్యాపేట, అక్టోబర్ 31(ప్రజానేస్తం జ్వాల): సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేటలో జాతీయ ఐక్యతా పరుగు నిర్వహించారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల చౌరస్తా వద్ద ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ పరుగును ప్రారంభించి, విద్యార్థులు, యువత, పోలీసు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు.

ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వరకు పరుగు కొనసాగింది. అనంతరం పటేల్ చిత్రపటానికి నివాళులర్పించి, జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండి, లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడాలని సూచించారు. దేశ ఐక్యత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరసింహాచారి, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, శిక్షణ అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.