Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హుజూర్‌నగర్ మండల ఎమ్మార్పీఎస్ మహిళా అధ్యక్షురాలిగా అమరారపు కుమారి మాదిగ

Author
Posted By Praja Nestham Jwala News
| 21 Nov 2026, 07:59 PM |
హుజూర్‌నగర్ మండల ఎమ్మార్పీఎస్ మహిళా అధ్యక్షురాలిగా అమరారపు కుమారి మాదిగ

మహిళా హక్కుల కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలి – నాయకుల పిలుపు

హుజూర్‌నగర్, నవంబర్21, ప్రజానేస్తం జ్వాల: మాదిగ మహిళా సంఘాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, మహిళా హక్కుల పరిరక్షణే లక్ష్యంగా హుజూర్‌నగర్ మండల మాదిగ మహిళా సమాఖ్య నూతన కమిటీని ఎన్నుకున్నారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, మాదిగ మహిళా సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు బియ్యంపొంగు విజయ మాదిగ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో హుజూర్‌నగర్ మండల అధ్యక్షురాలిగా అమరారపు కుమారి మాదిగ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలిగా వీరమ్మ మాదిగ, టౌన్ అధ్యక్షురాలిగా రణపంగు నాగమణి, అధికార ప్రతినిధిగా చిట్టిపాక విజయ మాదిగ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన పేద మహిళలపై జరుగుతున్న దాడులు, వివక్ష, వేధింపులు, ఆత్మహత్యల వంటి విషాదకర ఘటనలకు వ్యతిరేకంగా మహిళలు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కుల వివక్ష నిర్మూలన, మహిళలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమాన హక్కుల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మహిళా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బచ్చలకూరి ప్రసాద్ మాదిగ, హుజూర్‌నగర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేరిగ మట్టపల్లి మాదిగ, ఎమ్మెస్పీ మండల అధ్యక్షులు గుండెపంగు బాబు మాదిగ, ప్రధాన కార్యదర్శి చెడపంగు విజయ మాదిగ, మఠంపల్లి మండల అధ్యక్షులు కాంపాటి సందీప్ మాదిగ, ఆరాల సైదులు మాదిగ, కూరాకుల నరసయ్య మాదిగ, చిట్టిపాక సైదులు మాదిగ, ఒగ్గు విశాఖ మాదిగ, కస్తాల దిల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.