Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం సరికాదు. సిపిఐఎల్ఐ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి..

Author
Posted By Kommanaboina Yakaiah
| 24 Nov 2026, 06:22 PM | Politics, మహబూబాబాద్
ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం సరికాదు.  సిపిఐఎల్ఐ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి..

ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం సరికాదు.
సిపిఐఎల్ఐ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి..

ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం సరికాదు.  సిపిఐఎల్ఐ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి.. - Additional Image

మహబూబాబాద్ జిల్లా/ తొర్రూరు, నవంబర్ 24 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి):

ఇవి కూడా చదవండి

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించాయని సిపిఐ (ఎంఎల్)మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి,తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న లు అన్నారు. డిసెంబర్ 29న హైదరాబాదులో నిర్వహిస్తున్న ప్రజాగర్జన సభ సన్నాక ముఖ్య కార్యకర్తల సమావేశం తొర్రూర్ లో నేడు పార్టీ ఆఫీస్ లో డివిజన్ నాయకులుఉడుగుల రాములు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ ఇష్టం లేని ఓటర్లను తొలగిస్తూ అడ్డదారిలో గెలుస్తున్న మోడీ సర్కార్ భారత రాజ్యాంగాన్ని అది ఇచ్చిన హక్కులను రద్దు చేస్తుందని అన్నారు. జర్మనీ,ఇటలీ తరహా పాసిస్ట్ రాజ్యాన్ని స్థాపించడం కోసం మైనార్టీ మతస్తులను, అట్టడుగు కులాలను రెండవ శ్రేణి పౌరులుగా మార్చేందుకు జరుపుకున్న కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. 3 సంవత్సరాల నుండి రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైనారని, 420 హామీలు బుట్ట దాఖలు చేశారని అన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే ప్రాజెక్టులు కట్టడం కోసం మహారాష్ట్ర చత్తిస్స్గడ్ రాష్ట్రాలు తిరగటం దప్పిక వేసినప్పుడు బావి తవ్విన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. యుద్ధ ప్రాతిపదికల 3000 కోట్లతో రాష్ట్రంలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు అమలు కోసం సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ డిసెంబర్ 29న చలో హైదరాబాద్ నిర్వహిస్తుందని వేలాది మంది కదిలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయటం కోసం బైక్ ర్యాలీలు ఇంటింటి ప్రచారం పాదయాత్రలు నిర్వహించాలని రవి,సూరి లు పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తొర్రూర్ నాయకులు బూర్గుల మోష, సెగ్గం యాకయ్య, చింత నవీన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.