Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

Author
Posted By Nagaraju Golla
| 26 Nov 2026, 12:57 PM |
వడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

రైతులు ప్రైవేట్ మిల్లర్లకు అమ్మి మోసపోవద్దు.. అదనపు కలెక్టర్ ఎన్. రవి

శాయంపేట, నవంబర్‌ 26 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి గురువారం శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రైవేట్ రైస్ మిల్లర్లకు వడ్లు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. సన్న వడ్లకు ప్రభుత్వం బోనస్ కూడా అందిస్తోందని తెలిపారు.

కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగుల కొరతపై ఆరా తీసిన అదనపు కలెక్టర్, అవి అందుబాటులో లేకపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే గన్నీ బ్యాగులు తెప్పించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో తహసీల్దార్ ఆర్. ప్రవీణ్ కుమార్, ఆర్‌ఐ ఏ. చిమన్ నాయక్, సర్పంచ్ మంద దీన ప్రభాకర్, జీపీఓ బోగి దేవేందర్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి