Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భారతదేశ పరిపాలనకు న్యాయవ్యవస్థకు రక్షణ చట్టాలకు దిక్సూచి భారత రాజ్యాంగం... బహుజన సామాజిక కార్యకర్త తలారి అశోక్..

Author
Posted By Kommanaboina Yakaiah
| 26 Nov 2026, 06:29 PM | Array
భారతదేశ పరిపాలనకు న్యాయవ్యవస్థకు రక్షణ చట్టాలకు దిక్సూచి భారత రాజ్యాంగం... బహుజన సామాజిక కార్యకర్త తలారి అశోక్..

తొర్రూరు (హరిపిరాల) మహబూబాబాద్ జిల్లా నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి):

భారతదేశ పరిపాలనకు న్యాయవ్యవస్థకు రక్షణ చట్టాలకు దిక్సూచి భారత రాజ్యాంగం అని అలాంటి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని బహుజన సామాజిక కార్యకర్త తలారి అశోక్ కోరారు. గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తొర్రూరు మండలంలోని హరిపిరల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తలారి అశోక్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారతదేశ పాలనకు దిక్సూచి అని అలాంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది అని అన్నారు. అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు సమానమని చాటి చెప్పిన గొప్ప గ్రంథము భారత రాజ్యాంగమని.. భారత రాజ్యాంగం లేకపోతే పంచాయతి వ్యవస్థ నుండి దేశ ప్రధాన మంత్రి వ్యవస్థ వరకు ఏ నిర్ణయాలు తీసుకోవాలో అన్నిటిని పొందుపరిచిన భారతదేశ పరిపాలన గ్రంథం అయినటువంటి భారత రాజ్యాంగం మనకు నిర్మించి రూపకల్పన చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేసిన రోజు నవంబర్ 26 అని అన్నారు. అంతటి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా అధ్యక్షురాలు చెవిటి లింగమ్మ గ్రామ వార్డు మెంబర్లు తోట అశోక్, రామగిరి రమ, ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

భారతదేశ పరిపాలనకు న్యాయవ్యవస్థకు రక్షణ చట్టాలకు దిక్సూచి భారత రాజ్యాంగం... బహుజన సామాజిక కార్యకర్త తలారి అశోక్.. - Additional Image