Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సిటీ కేబుల్ జర్నలిస్ట్ యాకూబ్ కుటుంబానికి రూ‌.30 వేల ఆర్థిక చేయూత. దివంగత జర్నలిస్ట్ యాకూబ్ సతీమణి కి అందజేసిన టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్. ఏ జర్నలిస్టు కుటుంబానికి ఆపద వచ్చినా అండగా ఉంటుంది ఐజేయు..

Author
Posted By Kommanaboina Yakaiah
| 26 Nov 2026, 11:18 PM | TELANGANA, మహబూబాబాద్
సిటీ కేబుల్ జర్నలిస్ట్ యాకూబ్ కుటుంబానికి రూ‌.30 వేల ఆర్థిక చేయూత.  దివంగత జర్నలిస్ట్ యాకూబ్ సతీమణి కి అందజేసిన టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్. ఏ జర్నలిస్టు కుటుంబానికి ఆపద వచ్చినా అండగా ఉంటుంది ఐజేయు..

మహబూబాబాద్ నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి):....
మహబూబాబాద్ జిల్లాలో ఏ జర్నలిస్ట్ కు కష్టం వచ్చినా సాధ్యమైనంత మేర టియుడబ్ల్యూజే (ఐజేయు) అండగా ఉంటుందని మహబూబాబాద్ జిల్లా ఐజేయు అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఇటీవల యాకూబ్ మరణించిన రోజు అతనికి నివాళులు అర్పించేందుకు వెళ్ళిన సమయంలో ఆ నిరుపేద కుటుంబం పరిస్థితిని చూసి మనసు చలించిందని, తక్షణ సహాయంగా రూ.5 వేలు ఆ రోజు కార్యక్రమాల నిర్వహణ కోసం అందజేసి.. ఆ కుటుంబానికి ఇంకా కొంత సహాయం చేయాలనే ఆలోచనతో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అనే వాట్సాప్ న్యూస్ గ్రూప్ లో మెసేజ్ పెట్టగానే మానవతా విలువలతో స్పందించిన దాతలు తమ వంతుగా విరాళాల రూపంలో రూ.30వేలు (అక్షరాల ముప్పై వేల రూపాయలు) పంపించారని విజ్ఞప్తిని మన్నించి విరాళాలు పంపించిన, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించడానికి కారణమవుతున్న దాతలందరికీ.., మానవతా మూర్తులందరికి శిరస్సువంచి నమస్కరిస్తున్నానని... దాతల సహకారంతో సేకరించిన 30 వేల రూపాయలను యాకూబ్ సతీమణి కి గురువారం తోటి జర్నలిస్టులతో కలిసి అందజేశారు. తమ సహాయం చిన్నదే అయినా మా కుటుంబానికి జర్నలిస్ట్ యూనియన్ అండగా ఉంది అనే భరోసాను కొంత మానసిక ధైర్యాన్ని యాకూబ్ కుటుంబానికి దాతల సహకారంతో అందజేశారు. ఈ సందర్భంగా సి.హెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ యాకూబ్ వాస్తవానికి వేరే యూనియన్ సభ్యుడు అయినప్పటికీ మానవత్వంతో జర్నలిస్ట్ కుటుంబాలు ఒంటరి కావు అని దైర్యం చెప్పాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నామని అన్నారు. భవిష్యత్ లోనూ మహబూబాబాద్ జిల్లాలో ఏ జర్నలిస్ట్ కు కష్టం వచ్చినా టియుడబ్ల్యూజే (ఐజేయు) శక్తి మేరకు అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రతి సహాయాన్ని దివంగత జర్నలిస్ట్ యాకుూబ్ కుటుంబానికి అందేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి., యూనియన్ రాష్ట్రఅధ్యక్షులు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ లతో మాట్లాడి అందేలా చూస్తామని యాకూబ్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. తాము అందించిన స్ఫూర్తితో మరికొందరు స్పందించి యాకూబ్ కుటుంబానికి తమ శక్తిమేరకు ఆర్ధిక సహాయం చేయాలని కోరా. తమ ఇబ్బందిని గుర్తించి స్వచ్చందంగా ముందుకు వచ్చి‌ పెద్దమనుసుతో సహాయం చేయడమే కాకుండా ఈ విషాద సమయంలో ధైర్యాన్ని., భరోసా అందించిన యూనియన్ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్‌ కు., టియుడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్ కు యాకూబ్ సతీమణితో పాటు, కుమార్తె, కుమారుడు, కుటుంబసభ్యులు కన్నీరు నిండిన కళ్ళతో హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, జిల్లాఉపాధ్యక్షుడు ఉమ్మగాని మధు‌, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి రంగా చౌదరి‌, యూనియన్ నాయకులు బోనగిరి శ్రీనివాస్, రాహూల్ తదితరులు పాల్గొన్నారు.

సిటీ కేబుల్ జర్నలిస్ట్ యాకూబ్ కుటుంబానికి రూ‌.30 వేల ఆర్థిక చేయూత.  దివంగత జర్నలిస్ట్ యాకూబ్ సతీమణి కి అందజేసిన టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్. ఏ జర్నలిస్టు కుటుంబానికి ఆపద వచ్చినా అండగా ఉంటుంది ఐజేయు.. - Additional Image