Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భాగిర్థిపేట ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష

Author
Posted By Praja Nestham Jwala News
| 27 Nov 2026, 07:16 PM |
భాగిర్థిపేట ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్ష

విద్యార్థులందరికీ ఆల్ ఇన్ వన్ పుస్తకాల బహూకరణ

రేగోండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): భూపాలపల్లి జిల్లా భాగిర్థిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం హెల్ప్ టు నీడీ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతిభా పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వారందరికీ ఆల్ ఇన్ వన్ పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. జెన్కో కానిస్టేబుల్, కేటీపీపీకి చెందిన ఎన్. ఆంజనేయులు ఈ పుస్తకాలను అందించగా, హెల్ప్ టు నీడీ గ్రూప్ సభ్యుల చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వెముల కుమారస్వామి విద్యార్థులకు విలువైన సలహాలు, సూచనలు అందించారు. చదువుపై మరింత ఆసక్తి పెంపొందించుకోవాలని, కష్టపడి చదివి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం పట్టుదలతో కృషి చేయాలని ప్రోత్సహించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించడం, వారిలోని ప్రతిభను గుర్తించి తగిన సహకారం అందించడం, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన భగీర్తిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పుస్తకాల దాత ఎన్. ఆంజనేయులు, ప్రశ్నాపత్రాల రూపకల్పనలో సహకరించినవారు, పరీక్ష నిర్వహణలో పాల్గొన్నవారితో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ హెల్ప్ టు నీడీ గ్రూప్ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.