Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విదేశీ ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వ కొత్త పథకం.. రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ

Author
Posted By Marelli kiran
| 27 Nov 2026, 08:42 PM |
విదేశీ ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వ కొత్త పథకం.. రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ

హనుమకొండ, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలనుకునే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్‌’ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తొలి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మంది అర్హులైన యువతకు ఆర్థిక సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో రెండు రకాల వలస విధానాలకు ప్రభుత్వం సబ్సిడీ అందించనుంది. నేరుగా విదేశీ ఉద్యోగాలకు వెళ్లే వారికి రూ.50 వేల వరకు, విదేశీ భాషా పరిజ్ఞానం ఆధారంగా ఉద్యోగాలకు వెళ్లే వారికి రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనుంది. మిగిలిన 50 శాతం మొత్తానికి బ్యాంకు రుణ సదుపాయం కూడా కల్పించనున్నట్లు పథకం వివరాల్లో పేర్కొన్నారు.

18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువత ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది. అయితే అభ్యర్థులు తప్పనిసరిగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలోనే విద్యాభ్యాసం చేసి ఉండాలనే నిబంధన విధించింది. విదేశీ ఉద్యోగాల కోసం అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకోలేని యువతకు ఈ పథకం ద్వారా కొంతమేర భారం తగ్గనుంది. అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక మార్గదర్శకాల ద్వారా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.