Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వికాస్ హైస్కూల్‌లో విద్యార్థుల మాక్ గ్రామసభ.. ప్రజాస్వామ్య పాలనపై అవగాహన

Author
Posted By Kommanaboina Yakaiah
| 28 Nov 2026, 05:52 PM | Array
వికాస్ హైస్కూల్‌లో విద్యార్థుల మాక్ గ్రామసభ.. ప్రజాస్వామ్య పాలనపై అవగాహన

తొర్రూరు, నవంబర్ 28 (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ, గ్రామ పరిపాలనపై అవగాహన కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే ఉద్దేశంతో తొర్రూరు మండలం వెలికట్ట శివారులోని వికాస్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థుల ఆధ్వర్యంలో మాక్ గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు గ్రామ ప్రజాప్రతినిధుల పాత్రలను పోషించారు. డి.ఎస్. తరుణ్ సర్పంచ్‌గా, నందిని ఉపసర్పంచ్‌గా, మనోహర్ గ్రామ కార్యదర్శిగా వ్యవహరించారు. ఇతర విద్యార్థులు వార్డు సభ్యులు, గ్రామ ప్రజల పాత్రలు పోషిస్తూ గ్రామసభలో పాల్గొన్నారు.

గ్రామంలో నెలకొన్న సమస్యలు, మౌలిక సదుపాయాల అవసరాలు, పారిశుధ్యం, గ్రామ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై విద్యార్థులు చర్చించారు. ప్రజల సమస్యలను ఎలా గుర్తించాలి, వాటి పరిష్కారానికి గ్రామసభలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలను చర్చిస్తూ పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ గ్రామంలోని ఓటర్లందరికీ భాగస్వామ్యం కల్పించే అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక గ్రామసభ అని తెలిపారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యల పరిష్కారంలో గ్రామసభలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

వికాస్ హైస్కూల్‌లో విద్యార్థుల మాక్ గ్రామసభ.. ప్రజాస్వామ్య పాలనపై అవగాహన - Additional Image

విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు సమాజం, పరిపాలనా వ్యవస్థపై ప్రాయోగిక అవగాహన అవసరమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రశ్నించే తత్వం, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలు పెంపొందుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఈ అనుభవం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కె.వి. రెడ్డి, ప్రిన్సిపాల్ డి. నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ పి. రాజా, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి